క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గురువారం ఒంగోలు రామ్ నగర్ లోని బాలసదన్ ను జిల్లా కలెక్టర్ సతీమణి పి. సుజాత సందర్శించి పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పిల్లలకు స్వీట్స్ ను అందచేసారు. బాలసదన్ లో ఉంటున్న పిల్లలు బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి సువర్ణ, జిల్లా బాల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, బాలసదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


