భారత రత్న అటల్ బిహార్ వాజ్ పేయి ఆశయాలను కొనసాగించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. భారత రత్న ఆటల్ బిహార్ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు అర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ, మచ్చలేని రాజకీయ జీవితం అని, అనుభవం ఉన్న వ్యక్తి వాజ్ వేయి అని, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు తీసుకువచ్చి ప్రధాన మంత్రిగా పరిపాలన సాగించిన సంస్కరణలకు నాంది పలికిన నేత వాజ్ పేయి అన్నారు. నేడు భారత దేశాన్ని పరిపాలించే స్థాయికి బిజేపి పార్టీని తీసుకువచ్చిన ఘనత వాజ్వేయికే దక్కుతుందని అన్నారు. నేడు వాజ్ వేయి రాజ్ మార్గ్ ల ద్వారా ఆధునిక యంత్రాలతో హైవేల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మహానాయకుడని అన్నారు. మంచి రచయిత అని, నీతి వంతమైన రాజకీయ నాయకుడని, నేటికి డిల్లీ రాజకీయాలలో ఆయన నిజాయితీ చెప్పు కుంటారని అన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కూడ ఆయనను కలిసినప్పుడు ఆప్యాయంగా పలకరించి తేనీరు ఇచ్చే మర్యాద పూర్వకంగా ఉండే వారని అన్నారు. సహచర ఎంపీలకు ఎంతో గౌరవించే వారని అన్నారు. దేశ ప్రజలు కూడ ఆయన సేవలను నిరంతరం గుర్తు చేసుకుంటారని అన్నారు. మంచి రచయిత అని వందల పుస్తకాలు, కవితలు వ్రాసారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని నాయకులు ముందుకు సాగాలని కోరారు. ఆయన విగ్రహానికి పూలల మాలలు వేసి నివాళులు అర్పించి అయనకు నివాళులు అర్పించి జే జే లు పలికారు. కార్యక్రమంలో జిల్లా బిజేపి అధ్యక్షుడు సెగం శ్రీనివాస రావు, జనరల్ సెక్రటరీ శివాజీ యాదవ్, ఒంగోలు అసెంబ్లీ నియోజక వర్గ కన్వినర్ చిన యోగయ్య యాదవ్, అధికార ప్రతినిథి బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


