తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, తాళ్లూరు, కొత్తపాలెం, మాధవరం, లింగాలపాడు, బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం, నాగంబొట్లవారిపాలెం, రామభద్రాపురం, లక్కవరం, దోసకాయలపాడు, దారంవారిపాలెం, రమణాలవారిపాలెం, తురకపాలెం, విఠలాపురం, రజానగరం, కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాలలో సర్వలోక రక్షకుడు శాంతి ప్రధాత, సమానత్వం చూపే మహానీయుడు ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రై స్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. క్రీస్తు జన్మించినప్పుడు తూర్పువైపున పెద్ద చుక్క వెలిగింది. అప్పుడు పశువుల కొష్టంలో లోకరక్షకుడు జన్మిస్తాడని బైబిల్ చెబుతుంది. అందుకు చిహ్నంగా క్రై స్తవులు నివాసాల ఎదుట రంగు రంగుల స్టార్స అలంకరించుకున్నారు. క్రీస్తు జన్మతో చీకటి పోయి. వెలుగు వచ్చినందుకు చిహ్నంగా తాళ్లూరులో బేతేలు, హోలీ ప్రార్ధనామందిరం, ఎఈఎఫ్ చర్చిలో, తూర్పుగంగవరం జీవంగల ఏసు ప్రార్ధన మందిరంలో పలువురు ఫాస్టర్లు అర్ధరాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనలు చేసారు. ఆయా చర్చీలలో ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

