బాలానగర్ డిసెంబర్ 27, (జే ఎస్ డి ఎం న్యూస్) :
రౌడీ షీటర్లు బైండోవర్ షరతులు ఉల్లంఘిస్తే జైలుకే అంటూ బాలానగర్ ఏసిపి పింగళి నరేష్ రెడ్డి హెచ్చరించారు.శాంతి భద్రతల పరిరక్షణకు సైబరాబాద్ పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. రానున్న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో, బాలానగర్ జోన్ పరిధిలో నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఆదేశాలు, డీసీపీ సురేష్ కుమార్ సూచనల మేరకు శనివారం బాలానగర్ డివిజన్ పరిధిలోని సనత్ నగర్, బాలానగర్ పోలీస్ స్టేషన్లకు చెందిన 23 మంది రౌడీ షీటర్లకు బాలానగర్ ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఐ సక్రమ్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీపీ పింగిలి నరేష్ రెడ్డి రౌడీ షీటర్లను గట్టిగా హెచ్చరించారు. రౌడీ షీటర్లపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందని స్పష్టం చేశారు. బైండోవర్ అయిన నేరస్థులు ఎవరైనా సరే షరతులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, జైలుకు పంపడం ఖాయమని చెప్పారు.
ఇంకా నేరాలకు పాల్పడినా, పునరావృతం చేసినా పీడీ యాక్టును నమోదుచేసి సిపి నుండి నగర బహిష్కరణకు ఉత్తర్వులకు వెనుకాడమని ఏసీపీ తెలిపారు.
బైండోవర్ షరతులను ఉల్లంఘించిన రౌడీ షీటర్ అర్జున్ సింగ్‌ను ఇటీవల మిగిలిన బాండ్ఓవర్ కాలం వరకురిమాండ్కుతరలించామన్నారు. ఎవరైనా బైండోవర్ షరతులు ఉల్లంఘిస్తే, మిగిలిన కాలానికి తప్పనిసరిగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాక, పాత నేరాలలో పొందిన బెయిల్‌ను కూడా రద్దు చేస్తాం. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారి పట్ల ఉదారత చూపబోమని ఏసీపీ నరేష్ రెడ్డి హెచ్చరించారు.మంచి నడవడికతో జీవించాలని సూచించారు.గతంలో నేరాలకు పాల్పడిన వారు ఆ ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి, సమాజంలో మంచి నడవడికతో, హుందాగా జీవించాలని ఏసీపీ సూచించారు. వారి భవిష్యత్తును, కుటుంబాల సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని మారాలనిపిలుపునిచ్చారు.మంచి ప్రవర్తనతో ఉంటే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. దానితో పాటు సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి, అని రౌడీ షీటర్లకు ఏసీపీ నరేష్ రెడ్డి హితవు పలికారు.


