నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా జిల్లాలో ఒక రోజు ముందుగానే ఈనెల 31న ఎన్ టి ఆర్ పెన్షన్ పంపిణీ చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు డిఆర్ డిఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ టి నారాయణ తెలిపారు. జిల్లాలో 2,82,576 మంది పెన్షన్ దారులకు రూ.125 కోట్ల రెండు లక్షల ఐదు వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. 31న ఉదదయం మొదలు పెట్టి సాయంత్రం వరకు 98శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చెయ్యాలని చెప్పారు. అందుకు సంబంధించిన సమాచారం పెన్షన్ దారులకు అందించాలని కోరారు. ఎవరైనా ఒకటవ తేది అందుబాటులో లేక పోతే 2వ తేది వారికి పెన్షన్ అందస్తామని చెప్పారు. జిల్లా లోని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నిరంతరం పెన్షన్ల పంపిణీపై సమీక్షించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఈనెల 31న ఎన్ టి ఆర్ పెన్షన్ పంపిణీ – జిల్లాలో 2,82,576 మందికి లబ్ధి రూ. 125.25 కోట్ల పంపిణీ
27
Dec