జనవరి 1వ తేదిన నూతన సంవత్సర వేడుక దృష్ట్యా ఒకరోజు ముందుగానే అనగా ఈనెల 31న ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చెయ్యాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు అందినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. అందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. ఈనెల 31న ఉదయం 6.30 గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టి సాయంత్రం లోపు 98శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చెయ్యాలని కోరారు. కావున పెన్షన్ పంపిణీ దారులు అందరికి సమాచారం ఇచ్చి 31న పెన్షన్ దారులు అందుబాటులో ఉండేలా నచివాలయ సిబ్బంది చూడాలని కోరారు. తాళ్లూరు మండలంలో 6,149మంది పలు రకాల పెన్షన్ దారులకు రూ.2,69,01,500 అందివ్వనున్నట్లు ఎంపీడీఓ వివరించారు.
ఈనెల 31న ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ
27
Dec