పాఠశాలలలో ఎవైనా పనులు జరిగిన సమయంలో బిల్లులను నేరుగా సబంధిత వెండార్లకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని – సర్వశిక్ష అభియాన్ అడిషినల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనిల్ కుమార్ చెప్పారు. సర్వశిక్ష ఒంగోలు కార్యాలయంలో శనివారం పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రిన్సిపాల్స్కు సమావేశం నిర్వహించారు. ఎస్ ఎన్ ఏ – స్పర్శపై, పాఠశాలలో ఎవైనా పనులు జరిగినప్పుడు ఎకీకృత వ్యవస్థ ద్వారా బిల్లులు ఎలా చెల్లించాలని అనే విషయమై చర్చించారు. ఇప్పటి వరకు స్కూల్ గ్రాంట్స్ ల విషయంలో వెనక బడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయుల మరియు ప్రన్సిపాల్లను ఆ బిల్లులను త్వరితగతిన పూర్తి చెయ్యాలని అదేశించారు. ఎడీ శ్రీనివాస రెడ్డి, ఎ ఎం ఓ వి. నాగేంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

