ఉపాధి హామీ పనులలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులను వేగవంతం చెయ్యాలని
జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ జోషఫ్ కుమార్ కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఉపాధి హామీ కూలీ కార్డు దారులు అధిక సంఖ్యలో పనులలో పాల్గొనేలా మేట్లు చూడాలని, పనులను గ్రామాలలో వివరించాలని చెప్పారు. అదే విధంగా గోకుల షేడ్స్, ఇంకుడు గుంతలను వ్యక్తి గత, సామూహికంగా గుర్తించి వాటిని పూర్తి చేసి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కంపోస్ట్ పిట్స్ కూడ పూర్తి చెయ్యాలని, ఇచ్చిన లక్ష్యాల మేరకు పనులకు వేగవంతం చెయ్యకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీఓ అజిత, ఎపీఓ వెంకట రావు, ఈసీ శ్రీనివాస రెడ్డి, టిఏ లు నాగరాజు, రామక్రిష్ణ, ఎన్ నాగేశ్వర రావు, హనుమా నాయక్ లు, సీఓ లు సంగీత కవిత, సుకన్య, ఫీల్ట్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

