ఓటు కు ఆధార్ నమోదు చేసుకోవాలని, మృతుల ఓట్లను గుర్తించి తొలగించాలని డిఆర్ ఓ ఓబు లేసు చెప్పారు. డిఆర్ఓ చాంబర్లో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల వారు బూత్ లెవల్ ఎజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మృతుల ఓట్లను తక్షణమే తొలగించాలని వైసీపీ ప్రతినిథి దామరాజు క్రాంతి కుమార్ కోరారు. కార్యక్రమంలో కనిగిరి ఆర డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎఈ ఆర్టీఓ మంజు నాథ్ రెడ్డి, ఎ కుమార్, ఎస్ జాన్సన్, బ్రహ్మయ్య, జిల్లా ఎలక్షన్ సెల్ పర్యవేక్షకులు శ్రీనివాస రావు, ఒంగోలు తహసీల్దార్ మధుసూధన్, టిడిపి ప్రతినిథి కోనేటి వెంకట రావు, వైసీపీ ప్రతినిథి దామరాజు క్రాంతి కుమార్, కాంగ్రెస్ షేక్ రసూల్, బిజేపి గుర్రం సత్యం, సీపీఎం రఘ రామ్, జనసేన రమేష్, జిల్లా ఎన్నికల కార్యాలయం ఉపేంద్ర, డీటీ లు రాజశేఖర్, సలోమిలు పాల్గొన్నారు.


