30న ఒంగోలు జాబ్ మేళా – జిల్లా ఉపాధి కల్పనాధికారి రమాదేవి

జిల్లా ఉపాది కార్యాలయం ఆధ్వర్యములో ఎస్.బి.ఐ కార్డ్స్-ఇన్నోవ్‌సోర్స్ టాటా ఎలక్ట్రానిక్స్ మరియు స్టాఫ్ క్లౌడ్ సొల్యూషన్స్ కంపెనీ లో ఆర్. ఈ , బి. ఆర్. ఈ, టెలికాలర్, టీమ్ లీడర్, బి. డి. ఎం, యూఏ ,క్యూసి ఉత్పత్తి, మెషిన్ ఆపరేటర్ బెంచ్ సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిటైల్ & ప్రొడక్షన్ సపోర్ట్, పికింగ్ & ప్యాకింగ్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్టార్ లలో వివిధ రకాల ఖాళీలను భర్తీచేయుటకు ఏదైనా విభాగంలో టెన్త్, ఇంటర్మీడియేట్, మరియు ఏదైనా డిగ్రీ చదువులు పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూ లు జిల్లా ఉపాది కార్యాలయం, ఒంగోలు నందు ఈ నెల 30 వ తేదీన (మంగళవారం) ఉదయం 10:00 గం.ల నుండి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి
కె.రమాదేవి తెలిపారు.
ఇంటర్వ్యూ లో ఎంపిక కాబడిన అభ్యర్థులకు జీతం నెలకు 12,000/- నుండి 24,000/- వరకు ప్లస్ పనితీరు ఆధారంగా ఆకర్షణీయమైన ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.
కావున జిల్లాలోని 18సం,, నుండి 35 సం,,మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఇంటర్వ్యూ కు ఆధార్ కార్డు మరియు సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని కె.రమాదేవి, జిల్లా ఉపాది కార్యాలయం అధికారి తెలిపారు.
మరిన్ని వివరములకు https://employment.ap.gov.in/ లేదా ఆఫీసు పని సమయాలు 08592 281776 లను సంప్రదించగలరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *