భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఐ. ఎన్. సి) 141 వ ఆవిర్భావ దినోత్సవం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పెద్దలతో కలిసి షేక్ సైదా కాంగ్రెస్ పార్టీ పతా కాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అలుపెరగని పోరాటం నడిపి దేశానికి స్వాతం త్రాన్ని సముపార్జించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మహోత్సవాలమైన చరిత్ర గలదని ఈ దేశాన్ని 55 సంవత్సరాలు పాటు సుదీర్ఘంగా పరిపాలించి దేశ సమైక్యతను సమగ్రతను కాపాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ తాను 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించాలని పార్టీ కూడా తనను గౌరవించి అనేక పదవులు కట్టబెట్టిందని బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు.
పార్టీ సీనియర్లకు సత్కారం
కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లాలోని పలువురు సీనియర్ పార్టీ నాయకులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఇతర నేతలతో కలిసి పూలదండలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. వారిలో శ్రీపతి ప్రకాశం, షేక్ రసూల్, టాటా శ్రీనివాసరావు, కాకర్ల పూడి వేణు రాజు, మన్నం ప్రసన్న రాజు, బొడ్డు సతీష్, బలసాని కోటేశ్వరరావు, కొప్పోలు సుబ్బారావు, కే ఎన్ ప్రసాద్, రమణారెడ్డి, షేక్ రవూఫ్, రమణారెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర కేకేసి ప్రధాన కార్యదర్శి టి సుధీర్ వర్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షులు గోరంట్ల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు ఇరిగినేని వెంకట నరసయ్య, పయనం మధు, జాకబ్, శ్రీనివాసరాజు, జిల్లా మైనార్టీ నాయ కులు షేక్ అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంగ్రెసులో చేరిక..
ఒంగోలు పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఖరీదు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షించి నేడు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు షేక్ సైదా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.



