పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో 29న నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున, ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఫిర్యాదులు చేయుటకు అనవసరమైన వ్యయ ప్రయాసలు పడి జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని జిల్లా ఎస్పీ కోరారు.