ఉప్పుగుండూరులో ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నిర్మించాలని తెలుగుదేశం గ్రామ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బి.ఎన్.విజయకుమార్ కు వినతి పత్రం అందించిన సంగతి విధితమే దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి టి .వెంకటేశ్వర్లుతో పాటుగా ఇంజనీరింగ్ బృందం.సోమవారం స్థల పరిశీలన చేశారు.2008లో గ్రామపంచాయతీ తీర్మానం ద్వారా గుర్తించిన వాటర్ ట్యాంక్ వద్ద స్థలము,మట్టిగుంట రోడ్డులో స్థలము, చీరాల రోడ్ స్థలము, జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న పాత ఫ్యాక్టరీ స్థలాన్ని ఆబృందం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ప్రజలకుఉపయోగపడేలా ప్రభుత్వం ఆసుపత్రి భవనం ఉండాలని జనావాసాలు లేని ప్రాంతంలో మౌలిక వసతులు లేని ప్రాంతంలో ఆసుపత్రి భవనం నిర్మిస్తే అది ప్రజలకు ఉపయోగపడదని గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కొండ్రుఆశీర్వాదం లు.డి ఎం అండ్ హెచ్.ఓ. టి వెంకటేశ్వర్లు డిసిహెచ్ఎస్ సూరిబాబు దృష్టికి వారు తెలియజేశారు. కమ్యూనిటీ వైద్యశాల నిర్మాణం కు మౌలిక వసతులు అన్ని ఉన్న స్థలము ప్రజలకు ఉపయోగాలుగా ఉన్న స్థలము రవాణా సదుపాయానికి కూడా అనువైన స్థలము తాగునీరు సమృద్ధిగా ఉన్న స్థలం, మురుగు నీరుపోయే మార్గం అన్ని కలిసిన గ్రామపంచాయతీ తీర్మానం 2008లోనే ఇచ్చినప్రభుత్వ స్థలంలోనే కమ్యూనిటీ ప్రభుత్వ వైద్యశాల నిర్మాణం జరిపితే అందరికీ ఆమోదయోగంగా ఉండి ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుందనిదీనిద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కాట్రగడ్డ బాబు,డైరెక్టర్ మసిముక్కు భాస్కరరావు, రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ కేఎల్ నాగేశ్వరరావు ,సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుయువత కార్యదర్శి పిన్నక శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కోండ్రు ఆశీర్వాదం, మద్దినబంగారుబాబు , కనగాల కృష్ణ, గుమ్మడి చిన్న,తెలగతోటి సుబ్బయ్య, కందుల బాలయ్య,టీడీపీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు పొట్లూరి నాగమల్లేశ్వరరావు, మండల టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు కూతంబాకం సెల్వం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జాన్సన్,, క్లస్టర్ కోఆర్డినేటర్ కుంచాలనాగరాజు,టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

