తాళ్లూరు మండలంలో పదవతరగతి చదువుచున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చిన వంద రోజుల ప్రణాళికను పరిశీలించేందుకు మండల స్థాయి అధికారులను నియమించారు. అందులో బాగంగా సోమవారం ఎంపీడీఓ అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాద రావులో కస్తూరిభా పాఠశాల, శివరామపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తాళ్లూరు లోని వికే ఉన్నత పాఠశాలను ఆయా అధికారులు సందర్శించి విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. వారికి జరుగుతున్న టెస్ట్ ల ను పరిశీలించి పలు సూచనలు చేసారు.
