“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం తో పాటు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, శ్రీమతి కళావతి, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ధరఖాస్తులను పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. అర్జీలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు.
ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో మొత్తం 399 అర్జీలు రాగా రెవెన్యూ అంశాలపై 146 దరఖాస్తులు రాగా, వివిధ సమస్యలపై 253 వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


