బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ ఎం డి ఎం న్యూస్) :
ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలో చేరికలు జోరందుకున్నాయి అని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అన్నారు.బేగంపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ యాదయ్య కుమారుడు కేంబా సారం సురేష్ బీ ఆర్ ఎస్ పార్టీనీ వీడి తన అనుచరులతో కలిసి బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.డివిజన్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సురేష్ తో పాటు ఆయన అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.బండి రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక పథకాలు చేపట్టి అమలు చేస్తుందన్నారు. ప్రజా ప్రభుత్వం గా అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీలో సురేష్ కు అన్యాయం జరిగిందని తనకు కాంగ్రెస్ పార్టీలో సమచిత స్థానం కల్పించి న్యాయం చేస్తామని బండి రమేష్ హామీ ఇచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని బండి రమేష్ తెలియజేశారు. డివిజన్ అధ్యక్షుడు గౌడపల్లి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉందని, ఇటీవల జరుగుతున్న చేరికలతో మరింత బలోపేతం కానుంది అన్నారు. సురేష్ కు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సురేష్ మాట్లాడుతూ బేగంపేట డివిజన్ కు తన తండ్రి యాదయ్య కార్పొరేటర్ గా ఎంతో సేవలు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచే పార్టీ అని అన్నారు. డివిజన్లో ప్రతి పేదలకు ప్రభుత్వ పథకాలు అందించేలా బండి రమేష్ ,గౌడపల్లి రమేష్ ల సహకారంతో కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజీ టోచర్, దర్గా కరుణాకర్,రమాదేవి, ప్రవీణ్, కిరణ్, శ్యామ్, మహమ్మద్, సత్తార్ ,శీను, దేవా, బాల కుమార్, రంగయ్య, అశోక్, బాలమణి, సంధ్యా ,లక్ష్మీ ,అనురాధ, దయానంద్ ,జహంగీర్,నరసింగరావు, రాకేష్ భరత్ సురేష్ పర్వేజ్ తదితరులు పాల్గొన్నారు.



