బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్)
సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని నిరంతరాయంగా మురుగు పారుతున్న ప్రాంతాన్ని ఎన్ డి ఎం ఏ మాజీ ఉపాధ్యక్షులు ,బి జె పి జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి పరిశీలించారు.నియోజక వర్గం పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావు నగర్ పరిధిలో గాంధీ ఆస్పత్రి వెనుక రోడ్డులో కొన్ని నెలలుగా డ్రైనేజ్ నీరు లీకై స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ సమస్యను మర్రి శశిధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తనగా నియోజకవర్గ పరిధిలోని బాన్సిలాల్ పేట పద్మారావు నగర్ తదితరు ప్రాంతాల్లో డ్రైనేజీ ఎక్కడికి అక్కడ పొంగి రోడ్లపై ప్రవహిస్తూ స్థానికులను ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే సమస్యలను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని మర్రి ఆరోపించారు. ఎప్పటికైనా ఎమ్మెల్యే ప్రజా సమస్యల పైన దృష్టి చారించే సమస్యలను పరిష్కరించాలని మర్రి డిమాండ్ చేశారు. మరోసారి టికెట్ తనకు రాజన్న భయంతో ఆయన నిత్యం టిఆర్ఎస్ భవన్ లో కూర్చొని కేటీఆర్ భజన చేసుకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధికి నిధులు కేటాయించకుండా సవతి ప్రేమతో చూస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రామంచ మహేష్ జిల్లా కార్యదర్శి చెత్త నాన్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు కే ఎం కృష్ణ అంగముత్తు శ్రీనివాస్ గుంటి సత్యనారాయణ అండ్ చంద్రపాల్ రెడ్డి రాజీవ్ దేశ్ పాండే అనిత గుండు రఘురాం నైన్ శ్రీకాంత్ చారి, వికాస్ నరేష్ పిట్ల శ్రీనివాస్ వార్షి పరమేష్ బొజ్జ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

