సికింద్రాబాద్ డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
భారత కమ్యూనిస్టు పార్టీ సికింద్రాబాద్ సమితి ఆధ్వర్యంలో చిలకలగూడ మైలార్ గడ్డ ఆటో స్టాండ్ దగ్గర
సహాయ కార్యదర్శి కొమురెల్లి బాబు అధ్యక్షతన
సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన
సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పీడిత ప్రజల సమస్యల పైన రాజీలేని పోరాటాలు కొనసాగించి పేద ప్రజల గుండెల్లో వందేళ్లుగా నిలిచిన ఏకైక పార్టీ సిపిఐ అని కొనియాడారు. భారతదేశంలో బ్రిటిష్ పాలకవర్గానికి వ్యతిరేకంగామొట్టమొదటిసారిగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ సిపిఐ. పొత్తిళ్లలో పిడికిలి బిగించి నిర్బంధాలను కుట్ర కేసులను ఎదుర్కొంటూ ఏర్పడిన సిపిఐ ఇవాళ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది.దేశవ్యాప్తంగా భూస్వాములు జమీందారులు జాగిర్దారులకు వ్యతిరేకంగా పేద ప్రజలకు భూములు పంచాలని దున్నేవాడికే భూమి కావాలనే నినాదంతో సిపిఐ పార్టీ పోరాడింది. ఫలితంగా భూసంస్కరణ చట్టం అమలు జరిగింది. కోట్లాదిమంది పేద ప్రజలకు భూమిపైన హక్కులు లభించాయి సంవత్సరాల తరబడికౌలుచేసుకుంటున్నటువంటి రైతులకు చట్ట బద్ధమైన హక్కులు పోరాటాల ద్వారానే సాధించబడ్డాయని అన్నారు.
పోరాటాలద్వారాసాధించుకున్న కార్మిక హక్కులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాలను తుంగలో తొక్కుతూ నేడు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పైన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తోకల సోమయ్య, యాదగిరి, సయ్యద్ గౌస్,యాకయ్య,రవి, కుమార్, చంద్రశేఖర్,ఆంజనేయులు,శివ, రమేష్, తదితర కార్యకర్తలు పాల్గొనారు.


