సికింద్రాబాద్ డిసెంబర్ 30 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ దంపతులు నామాలగుండులోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో తెదేపా సీతాఫలమండీ డివిజన్ అధ్యక్షుడు జి వి కృష్ణ పాల్గొన్నారు.ఈసందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవించేలా చల్లగా చూడాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.

