వాహనదారులు నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించి సురక్షిత ప్రయాణం చెయ్యాలని ఎస్సై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరు ముండ్లమూరు ఆర్ అండ్ బి రహదారిలో దోర్నపు వాగు సమీపాన మంగళవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం సాగిస్తున్న పలువురికి కౌల్సిలింగ్ నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోవాలని కోరారు.
రజానగరంలో బెల్ట్ దుకాణంపై దాడి – కేసు నమోదు ….
తాళ్లూరు ఎస్సై మల్లిఖార్జున రావు మంగళవారం తన సిబ్బందితో కలిసి రజానగరంలో బెల్ట్ దుకాణంపై అకస్మిక దాడి నిర్వహించారు. బెల్ట్ దుకాణం నుండి 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని నిందితుడి అరెస్ట్ చేసారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

