విద్యుత్ ఓవర్ లోడ్ బకాయిలపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని దర్శి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పి శ్రీనివాసులు కోరారు. స్థానిక నబ్ స్టేషన్లో మంగళవారం ఎఈ రామక్రిష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో 200 యూనిట్ల పై న ఉపయోగిస్తున్న వినియోగదారులను గుర్తించి తక్షణమే బిల్లులు వసూలు చెయ్యాలని ఆదేశించారు. ఓవర్ లోడ్ ఉన్న వాటిని నబ్సిడీ ఉందని ఒక కిలో వాట్కి రూ.2250 కి చెల్లించ వలసి ఉండగా ప్రభుత్వం వేయ్యి నబ్సిడీ ఇస్తుందని గడువు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉన్నందున డిశంబర్ 31లోపు చెల్లించే విధంగా వినియోగదారులకు చెప్పాలని కోరారు. విద్యుత్ వినియోగంతో పాటు ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతున్న సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటుకు వినియోగదారులు ముందుకు వచ్చేలా ప్రొత్సహించాలని కోరారు. అక్రమ విద్యుత్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
