కాలనీ వాసులు తమ హక్కులను తెలుసుకుని ఉపయోగించుకోవాలని డిప్యూటీ
తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర అన్నారు. రజానగరం ఎస్సీ కాలనీలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం సర్పంచి వలి అధ్యక్షతన నిర్వహించారు. రజానగరం ఎస్సీ కాలనీలో 2014-19 మధ్య కాలంలో నిర్మించుకున్న కాలనీలకు బిల్లులు రాలేదని, స్పందించి ఇప్పించాలని కోరారు. కాలనీలో సైడు కాలువలు లేవని, వీధిలైట్లు వెలగటం లేదని చెప్పారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని తగిన విధంగా పరిష్కరించాలని కోరారు. కార్యాలయ ఎన్ ఏ శ్రీనివాస రావు, విఆర్ నాగూర్ బీ, సెక్రటరీ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.
