తాళ్లూరు మండలంలోని పలు వైష్ణవ దేవాలయాలో మంగళవారం భక్తి శ్రర్థలతో వైకుంఠ ఏకాదశి నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకువ జాము నుండే వేచి ఉంచి స్వామి వారిని దర్శించుకున్నారు. తాళ్లూరులో రిక్మిణీ సమేత వేణుగోపాల స్వామి, తూర్పుగంగవరం కోదండ రామాలయం, బొద్దికూరపాడులో శ్రీదేవి భూదేవి సమేత మాధవ స్వామి ఆలయంలో స్వామి వారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. బొద్దికూరపాడులో స్వామి వారిని గ్రామోత్సవం నిర్వహించారు. వంశపారంపర్యంగా నిర్వహిస్తున్న ఉభయ దాతల ఆధ్వర్యంలో స్వామి వారికి ఉత్సవం నిర్వహించారు.


