నేరాల నియంత్రణ మరియు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సమర్థవంతమైన పోలీసింగ్ అమలు చేస్తూ జిల్లా పోలీస్ శాఖ ప్రణాళికాబద్ధంగా విశేష కృషి చేస్తోంది -ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు- పోలీస్ వార్షిక నేర నివేదికను విడుదల – మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన వార్షిక నేర నివేదిక-2025 ను విడుదల – 2025 పలు సంచలనాత్మక కేసులు చేధన… కీలక కేసుల్లో నిందితులకు జీవిత/మరణించే వరకు శిక్షలు పడేలా చేసిన ప్రకాశం పోలీసులు

జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేసిన ఫలితంగానే ఈ సంవత్సరంలో నేరాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సమర్థవంతమైన పోలీసింగ్ విధానాలతో రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, నేర రహిత సమాజ నిర్మాణం దిశగా జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ వార్షిక నేర నివేదికను మంగళవారం విడుదల చేశారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

✳️అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో 8371 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 7818కు పరిమితమైంది. 6.61% మేర నేరాలు తగ్గాయి*.

*✳️విచారణలో ఉన్న కేసులు 2024 లో 11705 కేసులు ఉండగా, 2025 లో 13018 కేసులో 7897 కేసులను డిస్పోజల్ చేయగా 6% కేసులు తగ్గించటం జరిగింది*.

*✳️2025లో బాడిలీ అఫెన్సు కేసులు 1122, ఆస్తి సంభందిత నేరాలు 632, మహిళా సంభందిత నేరాలు 709, రహదారి ప్రమాదాలు 757, సైబర్ నేరాలు 44 నమోదు కాగా 2024 సంవత్సరంలో నమోదు అయిన కేసుల కంటే తక్కువ కేసులు అవటం విశేషం…*

*✳️2024 తో పోలిస్తే 2025 సంవత్సరంలోక్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్  17.08% తగ్గుదల. శిక్షలు 1 )20సంవత్సరాలు శిక్ష పడిన కేసులు –3, 2)జీవిత ఖైదు శిక్ష పడిన కేసులు – 3. 3)10 సంవత్సరాలు శిక్ష పడిన కేసులు – 2,4) 10 సంవత్సరాలు లోపు శిక్ష పడిన కేసులు – 8,  2025 సంవత్సరంలో మొత్తం 425 శిక్షలు విధించబడ్డాయి. అవగహన కార్యక్రమాలు,పల్లెనిద్ర, కేసులపై ప్రత్యేక మానిటరింగ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చేయటం తగ్గాయి*.

*✳️2025 లో 632 చోరీ కేసుల్లో సుమారు మొత్తం 8.70  కోట్లు రూపాయలు చోరికాగా 4.44 కోట్లు రూపాయలు రికవరీ…. ప్రాపర్టీ నేరాల్లో 51.02% పెరిగిన రికవరీ, ఫింగర్ ప్రింట్స్ 35, సీసీటీవీ ఫుటేజ్ -37, సాంకేతిక పరిజ్ఞానం -32 కేసులు కనుకోవటం జరిగింది. నైట్ బీట్స్, విజిబుల్ పోలీసింగ్, సీసీ,డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచటం ద్వారా గణనీయంగా నేరాలు తగ్గాయి*.  

*✳️రోడ్డు ప్రమాద మరణాల వార్షిక రేటు గతంతో పోల్చితో 13.29%కి తగ్గుదల మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృతంగా అవగాహన, మరణాలు రేటు 12.05% తగ్గించటం జరిగింది. ఇది ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు అవగాహన కార్యక్రమాల ఫలితం. స్టాప్ వాష్ అండ్ వాష్ ప్రోగ్రాం, బ్లాక్ స్పాట్ లో సోలార్ మార్చటం, డ్రోన్ తో నిఘా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం ద్వారా నేరాలు తగ్గాయి*.

*✳️ఈ చాలాన ద్వారా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై రూ.2.02 కోట్ల చలానా వసూలు చేయబడింది. ఈ సంవత్సరం 89% చలాన్ల వసూళ్లను సాధించి, సమర్థవంతమైన పనితీరుకు గాను గౌరవనీయ హైకోర్టు నుండి ప్రశంసలు అందుకున్నాము*.

*✳️డ్రంకెన్ డ్రైవ్ లో 2025 లో 5808 కేసులు నమోదు చేయగా 3363 మంది శిక్షలు మరియు జరిమానా గౌరవ కోర్ట్ వారు విధించారు*. 

*✳️2025 లో మిస్సింగ్ బాలికలు 136 నమోదు కాగా వాటిలో 129 బాలికలను 94.85% గుర్తించటం, మరియు 2025 లో 292 మిస్సింగ్ మహిళా కేసులు  నమోదు కాగా వాటిలో 264 మహిళలను 90.41% గుర్తించటం, మిస్సింగ్ కేసులపై అధిక దృష్టి సారించి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఉత్తమ ప్రయత్నాల ఫలితంగా మిస్సింగ్ కేసులు చేధింపు*.

*✳️2025 లో మొబైల్స్ మిస్సింగ్ 3877 ఫిర్యాదులకు వెంటనే స్వీకరించి, 2167 మొబైల్స్ గుర్తించి భాదితులకు అప్పగింత*

*✳️జాతీయ సైబర్ నేరాల నివేదిక పోర్టల్ లోని ఫిర్యాదులు 2025  సైబర్ నేరాల నమోదులో 4% తగ్గుదల ఉంది, విస్తృత అవగాహన ప్రచారాల సానుకూల ఫలితాన్ని లభించాయి*.

*✳️బహిరంగ మద్యపానం మరియు ప్రజా ఇబ్బందులకు వ్యతిరేకంగా ఈ సంవత్సరం 20,031 కేసులు నమోదు చేయడం జరిగింది. సమర్థవంతమైన చర్యలు మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో 1,025 మద్యపాన ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచడం జరిగింది*.

*✳️జిల్లాలో రౌడీ షీటర్స్ 1214 మంది ఉండగా వారిలో 173 చురుగా ఉన్నారని, 962 మందిని  బైండ్ ఓవర్ చేయటం జరిగిందని, మరికొంత మందిపై PD యాక్ట్ మరియు బహిష్కరణ చేయటం కూడా జరుగుతుంది*.

*✳️2025 లో MSCD Checks ద్వారా 65,576 మందిని చెక్ చేయగా 190 మంది పాత ముద్దాయిలను గుర్తించటం జరిగింది*.

*✳️జిల్లాలో 32 డ్రోన్ కెమెరాలు ఉండగా జిల్లా వ్యాప్తంగా 6474 ప్రదేశాలలో నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. సిసి కెమెరాలు 502 మ్యాట్రిక్స్ కెమెరాలు + 5737 ప్రైవేట్ కెమెరాలు) = 6239 కెమెరాలు నేరాలు నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి*.

*✳️తుపాన్ దృష్ట్యా భారీ వర్షాలు కురిసి చెరువులు, వాగులు నదులు పొంగి పొర్లడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టేలా పోలీస్ అధికారులు అప్రమత్తం చేయటం మరియు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించటం జరిగింది. కొండపి పరిధిలోని చోడవరం వద్ద మూసీ వాగు వరదల్లో చిక్కుకున్న 121 మంది వలస కూలీలను రక్షించటం జరిగింది*.

*✳️డయల్ 112 కు 18426 కాల్స్ చేయగా  సిబ్బంది వెంటనే స్పందించి, వెనువెంటనే సహాయం అందేలా కృషి చేశాం.. పలు రకాల సమస్యలతో ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తులను రక్షించాం*.

*✳️ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంతో సామాన్య ప్రజలకు చేరువై , పరిష్కారం కానీ సమస్యలను వెంటనే పరిష్కరించి ముఖ్యoగా వృద్దులకు అండగా నిలిచాం*.

*✳️వలస కార్మికుల డాక్యుమెంటేషన్: నేర నివారణ చర్యలను బలోపేతం చేయడానికి 3891 మంది వలస కార్మికుల వివరాలను సేకరించటం జరిగింది*.

*✳️2026 లో కూడా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా అధిగమించి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయటం జరుగుతుందన్నారు.*

ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తాలూకా సీఐ విజయకృష్ణ, పిసిఆర్ సీఐ దుర్గ ప్రసాద్, ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ఆర్ఐ సీతరామి రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *