బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ ఎస్పి రోడ్ లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు శ్రీ బద్రీనాథ్ చార్యుల పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ పి మహేశ్వరి శ్రీహరి, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నాయకులు టి శ్రీహరి శేఖర్ ముదిరాజ్ నాగరాజ్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.




