బేగంపేట డిసెంబర్ 30
(జె ఎస్ డి ఎం న్యూస్) :
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంచాలని కూకట్పల్లి నియోజకవర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రమేష్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రమేష్ తో పూజలు నిర్వహింపజేసి తీర్థప్రసాదాలను అందజేశారు. పూజలలో రాకేష్, భరత్ ,సురేష్,మోహన్,ప్రవీణ్ యాదవ్ లు ఉన్నారు.
