బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రజలందరినీ చల్లగా చూడాలని మాజీ మంత్రి ,బి జె పి సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గం ఎస్సార్ నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మర్రి శశిధర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మర్రికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. మర్రి వెంట బిజెపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
