బేగంపేట డిసెంబర్ 30
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్ధులు చురుకుగా పాల్గొనాలనీ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే. పద్మావతి పిలుపు నిచ్చారు.జాతీయ వినియోగ దారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ సహకారంతో వినియోగదారుల అవగాహన ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో వ్యాపార పద్ధతులు ,అన్యాయ వాణిజ్య విధానాలపై అవగాహన ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారి యూనిట్ 2 డా.డి.సరిత ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపాల్ కే.పద్మావతి మాట్లాడుతూ వినియోగదారులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.విద్యారులు యుక్త వయసులో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన మరింత పెంచుకోవాలని అన్నారు.కార్యక్రమంలో డా.నర్సింహులు,డా.మధుకర్ రావు,డా.ప్రసన్న,డా.మృదుల, డా.ఎలియట్ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు,బి బి ఏ విద్యార్థులు పాల్గొన్నారు.


