ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంలో తనకు ఉన్న భూమిలో కొంత బాగం సంవత్సరం పొడవునా కూరగాయాలు, ఆకు కూరలు, చిరుధాన్యాలు పండించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. వెలుగు కార్యాలయంలో బుధవారం రైతు సాధికార సంస్థ నేషనల్ మిషన్ ఆన్ నాచ్యురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి సాగుపై యాక్షన్ ప్లాన్పై సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఆర్పీ నాగేశ్వర రావు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు ప్రకృతి సాగు, సహజ సాగు, పెరటి కూరల పెంపకం, మహిళలు పోషకాహార పంట ఉత్పత్తులను పండించే విధానం, అన్ని కాలాలో సాగు చేయు విధానంపై అవగాహన పెంపొందించారు. వెలుగు ఎపీఎం దేవరాజ్, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, సెక్రటరీ లీలమ్మ, స్త్రీ నిథి మెనేజర్ పవన్ కళ్యాణ్,సీసీలు మోహన రావు, కోటేశ్వ బాబు, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
