బేగంపేట జనవరి 1 ,(జేఎస్ డి ఎం న్యూస్) :
ఈ ఆంగ్ల నామ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు చేకూరాలని, పార్టీలో చేరికలతో బూతు స్థాయిలో పార్టీ మరింత పటిష్ఠానికి కృషి చేయాలని సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్ పిలుపునిచ్చారు. గురువారం పారడైజ్ హోటల్లో సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షుడు షేక్ గౌస్ యువ నాయకుడు అభిషేక్ అడపా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల విందు సమావేశం నిర్వహించారు .ముందుగా దీపక్ జాన్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేశారు.నాయకులతో కలిసి కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్లోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపక్ జాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల నాటికి బూతు స్థాయిలో పార్టీని మరింత బరోపేతం చేయాలని కోరారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్,
సి రాజేందర్, హాజీతోచర్, మహమ్మద్ ఫయాజ్ ,మునీర్ ఖాన్ ,అనీఫ్, రమాదేవి, చంద్రకళ ,ముష్రా ,రాధా ,తస్లీమ్ ,అల్తమాష్ మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.


