జోరుగా … హుసారుగా – అంబరాన్నంటిన నూతన సంవత్సవ వేడుకలు -రాజకీయ నాయకులు నివాసాల వద్ద సందడి

జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. 2025 కి గుడ్ బై చెబుతూ 2026వ సంవత్సరానికి వెల్ కమ్ చెబుతూ యువతీ యువకులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, విద్యాసంస్థల అధిపతులు, విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలలో పాలు పంచుకున్నారు. మద్యం షాపులు, స్వీట్లు, బిర్యానీ సెల్స్ బాగా పెరిగాయి. ఎక్కడ చూసిన యువకులు రోడ్లపై హంగామా చేస్తూ కనిపించారు. మహిళలు వారి వారి వీధులలో రంగ వల్లులు వేస్తూ 12 గంటల వరకు వేచి మరీ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ప్రధాన వీధుల్లో బాణ సంచా పేల్చి యువత నూతన సంవత్సర వేడుకలలో మునిగి తేలారు. నూతన సంవత్సర శోభ కన్పించింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ వారి నివాసాల వద్ద పార్టీ శ్రేణులు అభిమానులు తరలివెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వైసీపి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా
పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలు దర్శి, చీమకుర్తిలో పార్టీ శ్రేణులు
ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సవ వేడుకలు
ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షఉడు వైసీపి జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపి సమన్వయ కర్త చుండూరు చుండూరి రవిబాబు
ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచి పెట్టారు.

ఆయాపార్టీల కార్యాలయాల వద్ద కేక్లు కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాజీ మంత్రి శిద్ధా నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి, కొండేవి, దర్శి, సంతనూతల పాడు, కందుకూరు లలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, బిఎన్ విజయకుమార్, నాగేశ్వర రావుల క్యాంపు కార్యాలయాలు, నివాసాల వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు రాకతో సందడి వాతావరణ నెలకొంది. మేయర్ గంగాడ సుజాత, జనసేన పార్టీ అద్యక్షుడు ఒంగోలు అర్బన్ డవలప్మెంట్ అధారిటీ చైర్మన్ షేక్ రియాజ్లకు నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్రాజా బాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజు లను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు కూడ కలెక్టర్, ఎస్పీలను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయం వద్ద ప్రతి సంవత్సరం వలే ప్రత్యేక కార్యాక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో అభిమానులు రాకతో పండుగ వాతావరణం నెలకొన్నది.

పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

నూతన సంవత్సర సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా షిర్డిసాయిబాబ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఐపీ రోడ్లోని పద్మాలయాస్ బేకరిలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. ఎంపీ మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజా బాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజులను ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ లు ఒంగోలు ఎంపీ మాగుంటను కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో మాగుంట అభిమానులతో పాటు తాతా ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి, అయినా బత్తిన ఘన శ్యామ్, కుప్ప రంగ సాయి, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *