వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి నివాసం అభిమానులతో కిక్కిరిసిపోయింది. నూతన సంవత్సర వేడుకలను వారి నివాసంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బూచేపల్లి కుటుంబ సభ్యుల కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి వచ్చిన అభిమానులు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. శ్రీ సూర్య గ్రానైట్స్ , బీవీఎస్సార్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ లను, మిఠాయిలను అభిమానులు కు పంపిణీ చేశారు. వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మండలంలోని వివిధ హోదాలలో ఉన్న వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని కలిసి పూల బొకేలు, పుస్తకాలు, పెన్నులు, అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి . మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మాజీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డిలు వైసీపీ మండల కన్వీనర్ లు కాకర్ల కృష్ణా రెడ్డి , చింతా శ్రీనివాస్ రెడ్డి, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానంద రెడ్డి, జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, రైతు విభాగం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, మాజీ మండల కన్వీనర్ సూది దేవర అంజయ్య, వైసీపీ రాష్ట్ర యువజన కమిటీ కార్యదర్శి చాగంరెడ్డి కృష్ణ చైతన్య రెడ్డి, నాయకులు పాలడుగు చిరంజీవి, మారెళ్ళ సర్పంచి గోపన బోయిన వెంకటేశ్వర్లు, మండల పంచాయతీరాజ్ అధ్యక్షులు బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




