ఎబీసీ హైస్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తరగతుల వారిగా కేక్ లు కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు డ్యాన్స్ లు
చేస్తూ ఆనందంతో గడిపారు. కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబులు పాల్గొని నూతన సంవత్సర సందేశాన్ని అందించారు. అనంతరం నూతన సంవత్సర కేక్ ను కట్ చేసి ప్రారంభించారు.
