హైదరాబాద్, జనవరి 1,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
దృష్టిలోపం ఉన్న చిన్నారులు ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించాలని నార్త్ జోన్ ట్రాఫిక్ 1 ఎసిపి జి శంకర్ రాజు అన్నారు.నూతన సంవత్సరం వేడుకలను బేగంపేట, మయూరీ మార్గ్‌లోని దేవ్‌నార్ అంధుల పాఠశాలలో జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన కేక్ కటింగ్ చేసి చిన్నారులకు పంచి పెట్టారు. చాక్లెట్లు పంచారు.పాఠశాల ఛైర్మన్, ఫౌండర్ డా. ఎ. సాయిబాబ గౌడ్ ప్రారంభించిన ఈ పాట శాలలో 600 మందికి పైగా దృష్టి లోపం ఉన్న విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపి శంకర్ రోజు మాట్లాడుతూ దేవదారు పాఠశాలలో అంధులైన చిన్నారుల మధ్య వేడుకలు జరుపుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కో-ఫౌండర్ జ్యోతి గౌడ్ ,వార్డెన్ పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

