మూడు కమీషనరేట్లను చేసి కూకట్ పల్లి నియోజక వర్గాన్ని ముక్కలు చేసారు…..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం.

బేగంపేట జనవరి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిందని,ఈ మధ్య కాలంలో మూడు కమీషనరేట్లను చేసి కూకట్ పల్లి నియోజక వర్గాన్ని ముక్కలు చేసారనీ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నియోజక వర్గం పరిధిలోని కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్టడీ టూర్ పేరుతో పది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని అని ,నగరంలో ప్రజలకు సరైన రోడ్డు,డ్రైనేజ్ సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారని,దోమల దాడితో అనారోగ్యానికి గురవుతున్నారని ఆరోపించారు.నియోజక వర్గానికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని ఆపేశారని అన్నారు.నియోజక వర్గంలో రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు బడ్జెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క శంకుస్థాపన చేయలేదన్నారు.ఎన్ని కుట్రలు చేసినా,ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే నన్నారు.జి హెచ్ ఎం సి కార్పోరేటర్లకు రెండు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతవరకు బడ్జెట్ ఇవ్వకుండా స్టడీ టూర్ కి వెళ్ళడం హాస్యాస్పదం అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్ ,ఆవుల రవీంద్రారెడ్డి, పండాల సతీష్ గౌడ్,జూపల్లి సత్యనారాయణ, సబియా గౌసుద్దీన్,పగడాల శిరీష్ బాబురావు,టి.మహేశ్వరి శ్రీహరి, మందడి శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్లు తుం శ్రవణ్ కుమార్ పగడాలు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *