బేగంపేట జనవరి 2 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
విధి నిర్వహణలో మరెన్నో ఉత్తమ సేవలు అందించాలనీ బదిలీపై వెళుతున్న సిబ్బంది ని ఏ సి పి.ఇన్స్ పెక్టర్,సిబ్బంది. ఘనంగా సత్కరించారు.ఇటీవల సాధారణ బదిలీలలో బేగంపేట పోలీస్ స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ విభాగానికి బదిలీ అయ్యారు.వారిని శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణ లో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఏ సి పి గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంతకాలం బేగంపేట లో క్రమ శిక్షణ తో నిర్వర్తించిన విధులను గుర్తించుకుంటామన్నారు.
ఇన్స్ పెక్టర్ సైదులు మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరుతున్న కార్యాలయంలో కూడా మంచిపేరు తెచ్చు కోవాలి అని అంటూ వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.బదిలీ అయిన సిబ్బంది మహేష్,లింగరాజు,సాయికాంత్,నరేందర్ లను శాలువాలతో సత్కరించి పూల మాలలు వేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎస్సైలు షఫీ,శ్రవణ్,సిబ్బంది, అప్పల సూరి తదితరులు పాల్గొన్నారు.
