తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఒంగోలులో ఎన్ జి వి ఎస్ కన్వేన్షన్ హాల్ (సంఘ మిత్ర ప్రక్కన ) శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు ఆపార్టీ ఒంగోలు పార్లమెంటు కమిటీ టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఇన్చార్జి మంత్రి అసంరామ నారాయణ రెడ్డి, మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు ఇతర ప్రజా ప్రతినిథులు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని టిడిపి శ్రేణులను ఆయన కోరారు.
టిడిపి ఒంగోలు పార్లమెంటు కమిటి ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతం చెయ్యండి – ఒంగోలు పార్లమెంటు కమిటీ టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర
02
Jan