సీనియర్ సిటిజన్స్ కు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను తాళ్లూరు లో సీనియర్ సిటిజన్ కంచర్ల పిచ్చమ్మ వైద్యులు, వైద్య సిబ్బందికి గత ఆరేళ్లుగా నూతన సంవత్సరం సందర్భంగా స్వీట్లు అందిస్తున్నారు. అందులో బాగంగా శుక్రవారం స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆరోగ్య, ఆశ సమావేశం అనంతరం ఆరోగ్య సిబ్బంది సేవలను ఎబీసీ హైస్కూల్ డైరెక్టర్ కంచర్ల కాలేషా బాబు కొనియాడారు. తన తల్లి పిచ్చమ్మ గత ఆరేళ్ల క్రితం దీర్ఘకాలిక వ్యాధి ఘగర్, బిపి తో బాధపడుతుండగా నాడు తాళ్లూరు పీహెచ్సీ వైద్య సేవలు చాలా చక్కగా ఉన్నాయని తెలిసి ఇక్కడ రాగా నాటి వైద్యాధికారి ఖాదర్ మస్తాన్బి మంచి వైద్యం అందించి తన తల్లికి సేవలు చేసారని చెప్పారు. కోవిడ్ సమయంలో తర్వాత ఆరోగ్య, ఆశ కార్యకర్తలు తమ నివాసం వద్దకు వచ్చి యోగ క్షేమాలు అడిగారని అందుకు కృతజ్ఞతగా తన తల్లి ప్రతి సంవత్సరం ఆరోగ్య సిబ్బందికి స్వీట్లు పంచుతున్నట్లు చెప్పారు. నేడు వైద్యాధికారులు ప్రవీణ్, రాజేష్ బాబులు కూడ చక్కటి సేవలు అందిస్తున్నారని అన్నారు. అనంతరం సిబ్బంది 55 మందికి స్వీటు బాక్స్లు అందించారు. సీహెచ్ రమణమ్మ, హెచ్ఎన్ రవి, పీహెచ్ఎన్ విజయమ్మ పాల్గొన్నారు.


