కురిచేడు మండలానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన నిందుతుడు రాగుల శ్రీనును తక్షణమే అరెస్ట్ చెయ్యాలని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు దార అంజయ్య డిమాండ్ చేసారు. తాళ్లూరు మండల కార్యాలయాల కాంప్లెక్స్ లో
ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెళ్లియి ఇద్దరు పిల్లను ఉన్న నిందితుడు ధేకన కొండకు చెందిన రాగుల శ్రీను బాధిత బాలికను మాయ మాటలు చెప్పి నాగార్జున సాగర్ తీసుకువెళ్లి నాలుగు రోజుల పాటు హత్యచారం చేసారని చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు
సాంకేతిక పరిజ్ఞానంతో నిందుతుడిని పట్టుకున్నారని చెప్పారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చెయ్యాలని, బాధిత బాలికను హెూమ్ మంత్రి అనిత పరామర్శించి బీసీ కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసారు.
