రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
అన్నారు. మంగళవా రం కొండేపి నియోజ కవర్గం పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనే యస్వామి, జిల్లా కలెక్టర్ పి.రాజ బాబు రైతులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘికసంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్రం లోభూహక్కులకు సంబంధించి21లక్షల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో రీ సర్వే పూర్తి చేసిన గ్రామాల లో కొత్తగా రైతులకు రాజముద్ర కలిగిన పట్టాదార్ పాస్ పుస్త కాలనుపంపిణీ చేయ డానికి ప్రభుత్వం చర్యలుతీసుకుంద న్నారు. భూమి హక్కులకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం రైతులకు హక్కుగా ప్రభుత్వం కల్పించింద న్నారు. గత ప్రభుత్వంలో పాలకులు పాసు పుస్తకాలపై వ్యక్తిగత ఫోటోలను ముద్రించి రైతులకు పంపిణీ చేయడంజరిగింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు సమస్యలను పరిష్క రించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలో రీ సర్వే చేపట్టి పారదర్శకంగా రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగు తుందని ఆయన చెప్పారు. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసిన వెంటనే రైతులకు సంబంధించిన భూముల వివరాలు, హద్దులు వెంటనే తెలుసు కోవచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులు సంబంధించి 22ఏ నిషేధ జాబితాలో ఉన్న 5 రకాల భూములను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇనాం భూములు,అసైన్మెంట్ భూములు నిషేధిత జాబితా నుండి తొలగించడానికి ప్రభుత్వంత్వరలో చర్యలు తీసుకో బోతుందని ఆయన చెప్పారు. కొండేపి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటు న్న సమస్యలను తొలగించడానికి ప్రతి మండలంలో రెవెన్యూ క్లినిక్ లను నిర్వహించ వలసిందిగా కలెక్టర్ కు సూచించామన్నారు. రాష్ట్రంలోమహిళలకోసం శ్రీశక్తి పధకం క్రింద ఉచిత బస్సు సౌకర్యం అందుబాటు లో తీసుకొచ్చామన్నారు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం క్రింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలు కూడా తల్లికి వందనం క్రింద నగదు జమ చేస్తున్నా మని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నామని మంత్రి చెప్పారు. గృహ నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారుల కు బిల్లులు వెంటనే చెల్లిస్తామని మంత్రి చెప్పారు. కొత్తగా మంజూరైన గృహాలను ఫిబ్రవరి మాసం నుండి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలకు చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ భూములకు సంబంధించిన పట్టాదారుపాస్ పుస్తకాలు రైతులకు హక్కుగా ప్రభుత్వం కల్పించడం జరిగింది అన్నారు.ప్రజల సౌలభ్యం కొరకు ప్రభుత్వం గ్రామాల్లో రీ సర్వే చేపట్టి రైతులకు పట్టాదార్ పాస్ పుస్త కాలను పంపిణీ చేయడం జరుగు తుందని ఆయన చెప్పారు. జిల్లాలో రెవిన్యూ శాఖకు సంబంధించి 80 నుండి 90 శాతం వరకు సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్క రించడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. రెవెన్యూ సమస్యలు పరిష్క రించడానికి పీ.జీ.ఆర్.ఎస్ లో రెవెన్యూ క్లినిక్ లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. రెవిన్యూ క్లినిక్ లో వీఆర్వోలు,ఎమ్మార్వో లు, రెవెన్యూడివిజన్ అధికారులు, జాయింట్ కలెక్టర్ మరియుకలెక్టర్ ఉంటారని రికార్డులు కూడా అందుబాటులో ఉంటాయని రెవెన్యూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించ డానికి వీలవు తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. రైతులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని తమ భూములకు వివరాలు హద్దులను నేరుగా తెలుసు కోవచ్చునని ఆయన చెప్పారు. 22 ఏ నిషేధ జాబితాలో ఉన్న 5 రకాల భూములను తొలగించడానికి ప్రభుత్వంచర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు పొరపాటున పోయినా కూడా డేటాఉంటుంద ని రైతులుభయపడ నవసరంలేదనిఆయన ఈసందర్భంగా చెప్పారు.ఈసందర్భం గావెల్లటూరుగ్రామం లో470మందిరైతుల కు పట్టాదారుపాస్ పుస్తకాలను రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి మరియు జిల్లాకలెక్టర్ పి.రాజాబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో ఇరిగేషన్ శాఖ ఎస్.ఇ వరలక్ష్మి, జిల్లాసాంఘికసంక్షేమ శాఖఅధికారి లక్ష్మణ నాయక్, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమ వంశీ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సుజాత, తాహసిల్దార్ పుల్లారావు,తదితరులు పాల్గొన్నారు.

