జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వెలుగు వారి పాలెంలో ప్రాధమిక పాఠశాల (ఎఎ)లో శనివారం నిర్వహించారు. సావిత్రి భాయి పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి సావిత్రి భాయి పూలే చరిత్రను, ఆమె మహిళా విద్యకు చేసిన కృషిని వివరించారు. పాఠశాల చైర్మన్ ఆలూరి రమేష్, వైన్ చైర్మన్ జన రాజు పల్లి నాగమణిలు పాల్గొన్నారు.
