దివంగత సాయిబాబా కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

హైదరాబాద్ జనవరి 4
(జే ఎస్ డి ఎం న్యూస్) :
టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని సాయిబాబా మృతి బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విదేశీ పర్యటన ముగించుకొని ఆదివారం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా బేగంపేటలోని సాయిబాబా ఇంటికి వెళ్లారు.ముందుగా సాయిబాబా చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి చంద్రబాబు ధైర్యం చెప్పారు.
అనంతరం సి ఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో ప్రతి సందర్భంలో తనకు స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేసిన వ్యక్తిని కోల్పోవడంబాధాకరమన్నారు. చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేసిన నిబద్ధ నాయకుడు సాయిబాబా అని, ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్‌గా సేవలందించడం అభినందనీయమన్నారు. సాయిబాబా కుటుంబం పలు సమస్యల్లో ఉందని తెలిసిందని, వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణ జలాల అంశంపై మాట్లాడుతూ, ఆ విషయంపై అన్ని అంశాలను త్వరలో వివరంగా మాట్లాడుతానని చంద్రబాబు నాయుడు తెలిపారు.సి ఎం వెంట టి డి పి నాయకులు కంభం పాటి రామ్మోహన్ రావు,అరవింద కుమార్ గౌడ్,కూరపాటి వెంకటేశ్వరరావు,శ్రీపతి సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *