ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు విద్యుత్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు
గత వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్లు
రూ.32 వేల కోట్ల భారాన్ని మోపారని అన్నారు
విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నదని స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి, ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు పెంచారని విమర్శించారు. దీని వల్ల ప్రజలపై సుమారు రూ.32 వేల కోట్ల భారాన్ని మోపారని తెలిపారు.
ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
అలాగే ప్రతి యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. . గత పాలనలో రాష్ట్రానికి లక్ష 29 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చారని విమర్శించారు.
