బేగంపేట డివిజన్ లో పార్టీ పటిష్టానికి ఒక్క తాటి పైకి వచ్చి కృషి చేయాలి…సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా.కోట నీలిమ.

బేగంపేట జనవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్)
బేగంపేట డివిజన్లో పార్టీ పటిష్టానికి అంతా ఒక్కతాటిపైకి వచ్చి రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ పిలుపునిచ్చారు. సోమవారం బేగంపేట డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ ,అభిషేక్ అడపా,
సి. రాజేందర్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కోట నీలిమను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా వారు కోట నీలిమను శాలువాతో సత్కరించారు.పూల గుచ్చం అందించారు. ఈ సందర్భంగా తనను కలిసిన కాంగ్రెస్ నాయకులతో కోట నీలిమ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని, త్వరలో జరగనున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పూర్తి మద్దతు తెలియజేసి విజయాన్ని అందించాలని కోరారు.
అలాగే డివిజన్ పరిధిలోని ప్రతి బూతులో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు పోలయ్యే విధంగా నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి చేయాలని సూచించారు. ఏమైనా విభేదాలుంటే వాటిని పక్కనపెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలి అన్నారు. ప్రతి నాయకుడికి, కార్యకర్తకు పార్టీ తరుపున న్యాయం జరిగే విధంగా తాను సహకారాలు అందించేందుకు అన్నివేళలా ముందుంటానన్నారు. ప్రతి ఒక్కరూ రోజు తమ ప్రాంతంలో గల్లి గల్లిలో తిరిగి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు .అలాగే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించడంలో తమ వంతు వారికి సహాయ సహకారాలు అందించాలన్నారు .డివిజన్ పరిధి లో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ గౌస్, అభిషేక్ అడపా,
సి. రాజేందర్ ,హనీఫ్ ఖాన్, మునీర్ ఖాన్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *