ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది రోడ్డు భద్రతకే పరిమితం కాదు రోడ్లపై ఉన్న ప్రతి జీవాన్ని, మాటలేని పక్షులను కూడా కాపాడడమే అసలైన బాధ్యత…. నార్త్ జోన్ ట్రాఫిక్ 1 ఏ సి పి జీ.శంకర్ రాజు.

హైదరాబాద్, జనవరి 5,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్రాఫిక్ క్రమశిక్షణ అనేది రోడ్డు భద్రతకే పరిమితం కాదనీ, రోడ్లపై ఉన్న ప్రతి జీవాన్ని, మాటలేని పక్షులను కాపాడడమే అసలైన బాధ్యత అని నార్త్ జోన్ ట్రాఫిక్ 1
ఏ సి పి జీ.శంకర్ రాజు అన్నారు.సోమవారం బేగంపేట ట్రాఫిక్ పోలీసులు ప్రాణాపాయ స్థితిలో వున్న పావురాన్ని రక్షించారు.జాతీయ పక్షి దినోత్సవం సందర్భంగా, బోయిన్ పల్లి ఎక్స్ రోడ్స్ వద్ద ఉన్న ఒక ప్రకటన హోర్డింగ్‌పై మాంజా (గాలిపటం దారం)లో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పావురాన్ని రక్షించినందుకు బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ కు చెందిన హోం గార్డ్ ఎస్. గోపాల్ (హెచ్ జీ 3017)
హోం గార్డ్ ఎం.డి. అఫ్సర్ (హెచ్ జి 7281)లను ఏ సి పి శంకర్ రాజు సన్మానించారు. హోం గార్డ్ ఎస్. గోపాల్ హోర్డింగ్‌పైకి ఎక్కి పక్షిని సురక్షితంగా విడిపించగా,
హోం గార్డ్ ఎం డి అఫ్సర్ కింద నుండి అవసరమైన సహకారం అందించారు. వారి స్పందన వల్ల పక్షి ప్రాణం కాపాడగలిగారన్నారు.
ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగిందన్నారు.వారిరువురి ప్రశంసనీయమైన, మానవీయ సేవలను గుర్తించి, ఏసీపీ శంకర్ రాజు,అదనపు ఇన్‌స్పెక్టర్ జి.జానకి రాములు ఏసీపీ కార్యాలయంలో హోం గార్డులను సత్కరించారు.
ఇలాంటి సేవలను ప్రోత్సహించేందుకు,పావురాన్ని కాపాడిన హోం గార్డుల పేర్లను రివార్డ్ రోల్ కోసం ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏ సి పి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *