బాల్య వివాహాలు చట్టా రీత్యా నేరమని వాటిని నిరోధించటానికి ప్రతి ఒక్కరి చేయూత
అవసమని వక్తలు అన్నారు. దళిత బహుజన రీసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం బాల్య వివాహాల నియంత్రణ పై అవగాహన కల్పిస్తూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తహసీల్దార్ బి వి రమణా రావు, ఎస్పై మల్లిఖార్జున రావు, వ్యవసాయాధికారి ప్రసాద రావు, హౌసింగ్ ఎఈ హనుమంత రావులు పాల్గొని తహసీల్దార్, పోలీస్ స్టేషన్లలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. బాల్య వివాహాల వలన కలిగే మానసిక శారీరిక నష్టాలు, బాల్య వివాహాల నిరోధక చట్టం – 2006ల గురించి వారు వివరించారు. డిబిఆర్సీ ఎరియా కోఆర్డినేటర్ దార్ల కోటేశ్వర రావు, ఎన్ జీఓ ప్రతినిధి పి శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

