అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు ఉ పయోగపడేలా తీర్చిదిద్దాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో అన్ని సోమవారం వికసిత్ భారత్ – జి రామ్ జి. స్వచ్చ సంక్రాంతి -న్వచ్చ గ్రామ పంచాయితీలు కార్యక్రమం నిర్వహించారు. తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీడీఓ అజిత మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామ పంచాయితీలకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అందరి సహకారంతో విజయవంతం అవుతాయని అన్నారు. తూర్పుగంగవరంలో ఎంపీడీఓ మాట్లాడుతూ ఎన్ డబ్ల్యు పీసీ కేంద్రాన్ని ఉపయోగంలోనికి తీసుకురావాలని కోరారు. అక్కడ టిడిపి కి చెందిన వ్యక్తి ఇనుకను డప్ చేసి వాడుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చిందని తక్షణమే ఖాళీ చేయించి ఉపయోగం లోనికి తీసుకురావాలని గ్రామ కార్యదర్శి నాగ మల్లేశ్వరి ని ఆదేశించారు. గతంలో తూర్పుగంగవరంలో 2400 మంది వద్ద పన్నులు వనూలు చేసి బిల్లులు ఇచ్చారని వాటిని పంచాయితీ ఖాతాలో జమ చేయ్యలేదని సొసైటీ చైర్మన్ వల్లభనేని సుబ్బయ్య నభ దృష్టికి తెచ్చారు. విఠలాపురం లో సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. నూతనంగా చేపట్టనున్న వికసిత్ భార్ జి రామ్ లో ఉపాధి కూలీలు అందరూ పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఆయూ సభలలో గ్రామ కార్యదర్శులు షహనాజ్ వేగం పి మెలకయ్య, నుబ్బా రెడ్డి, శ్రీవల్లి, ఈవీశేషమ్మలు, మన్నేపల్లిలో పంచాయితీలో సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర), తాళ్లూరులో డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసన రావు, తూర్పుగంవరంలో ఎంఈఓ జి నుబ్బయ్య, అన్ని పంచాయితీలలో మండల స్థాయి అధికారులు వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎపీఓ వెంకటేశ్వర్లు, ఎపీఎం దేవరాజ్ తదితరులు పాల్గొని పధకాల లక్ష్యాన్ని వివరించారు.




