సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు నిర్వహించటం అభినందనీమని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. తాళ్లూరులో బుధవారం ఎబీసీ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలలో బాగంగా బుధవారం ముగ్గుల పోటీలు ప్రారంభించారు. మండల విద్యాశాఖాధికారి -1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ముగ్గుల పోటీలను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ – 1 జి సుబ్బయ్య మాట్లాడుతూ నేటి చిన్నారులకు మన సంస్కృతిలో ముగ్గుల ప్రాముఖ్యతను చాటి చెప్పెందుకు పోటీలు ఎంతో దోహద పడతాయని అన్నారు. ఎంఈఓ -2 సుధాకర్ రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో ముగ్గులకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ముగ్గులలో ప్రతిభ చాటిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్ కాలేషా బాబులు పాల్గొన్నారు.






