మహిళలు తమ హక్కులను తెలుసుకుని అభివృద్ధి చెందాలని స్వయం సహాయక సంఘాల జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జి కవిత అన్నారు. తాళ్లూరు వెలుగు కార్యాలయంలో బుధవారం జెండర్ రిసోర్స్ సెంటర్ ను ప్రారంభించారు. డీపీఎం నువార్త, ఎపీఎం ఆశాలతకు పాల్గొని జెండర్ రిసోర్స్ సెంటర్ లక్ష్యాలను వివరించారు. కుటుంబం నుండే చిన్నారులకు మగ, ఆడ భేదం లేకుండా చూడాలని, వివక్ష లేకుండా పెంచిననాడే మంచి నమాజం సాధ్యమని చెప్పారు. ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, ధనలక్ష్మి, లీలా వతి, ఎపీఎం దేవరాజ్, సీసీలు మోహన రావు, కోటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెండర్ సెంటర్ ను ప్రారంభించారు.
