తాళ్లూరు మండలంలో పలు ఫెర్టిలైజర్స్ దుకాణాలను వ్యవసాయాధికారి ప్రసాద రావు బుధవారం తనిఖీ నిర్వహించారు. యూరియా నిల్వలను తనిఖీ చేసి నిర్ణయించిన ధర మేరకే అమ్మాలని, ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు అవసమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని ఆందోళన చెందవద్దని చెప్పారు.
